మ‌హేష్ బాబు కెరీర్ లో కృష్ణ‌కు అస్స‌లు న‌చ్చ‌ని సినిమా ఇదే.. రిజ‌ల్ట్ కూడా ముందే చెప్పేశారు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగా మరి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. భారీ బ్యాక్ గ్రౌండ్ వల్ల ఆఫర్లు ఈజీగానే వచ్చిన.. సొంత టాలెంట్ తోనే మహేష్ స్టార్ అయ్యాడు. తండ్రికి తగ్గా తనయుడ‌ని నిరూపించుకున్నాడు.

అయితే మహేష్ బాబు కెరీర్ లో ఆయన తండ్రి కృష్ణకు అస్సలు నచ్చని సినిమా ఏదో తెలుసా.. `నాని`. వాస్త‌వానికి మ‌హేష్ బాబు కెరీర్ ఆరంభం నుంచి తండ్రి స‌పోర్ట్ లేకుండానే క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌చ్చాడు. కృష్ణ ఎప్పుడూ క‌థ వినేవారు కాదు. నేరుగా థియేట‌ర్‌లోనే సినిమాలు చేసి ఎలా ఉందో చెప్పేవారు. అలా ఎస్.జే. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు చేసిన‌ `నాని` మూవీ చూసిన‌ప్పుడు.. సినిమా ఫ్లాప్ అని కృష్ణ ముందే చెప్పేశార‌ట‌.

అంతేకాదు నాని సినిమా గనుక హిట్టైతే మహేష్ బాబు స్టార్ అవ్వడు అని కూడా అన్నార‌ట‌. అలా ఎందుకు అన్నారంటే ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఒక హీరో ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేయలేరు. ఒక‌వేళ యాక్సెప్ట్ చేస్తే ప్రేక్ష‌కులు స‌ద‌రు హీరో నుంచి అలాంటి సినిమాలే కోరుకుంటారు. అలాంటి సినిమాల‌తో స్టార్ అవ్వ‌డం అసాధ్యం. అందుకే నాని మూవీ హిట్టైతే మ‌హేష్ స్టార్ అవ్వ‌లేడ‌ని కృష్ణ తెలిపారు. కొన్నేళ్ల త‌ర్వాతే త‌న తండ్రి ఆ మాట ఎందుకు అన్నారో మ‌హేష్ కు కూడా అర్థ‌మైంది. ఇక కృష్ణ చెప్పిన‌ట్లే నాని మూవీ ఫ్లాప్ అయింది. మ‌హేష్ కెరీర్ లోనే డిజాస్ట‌ర్ గా నిలిచింది.