సరికొత్త చరిత్ర సృష్టించిన స్టైలిష్ స్టార్… టాలీవుడ్ చరిత్రలోనే తొలి హీరోగా రికార్డ్….!!

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడుగా రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకుని బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. కాగా.. ఢిల్లీలో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేశారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” పుష్ప ” సినిమాలో నటుడుకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా స్టార్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్లు అర్జున్ కు ఈ అవార్డును అందించారు. ఈ అవార్డు అందుకోవడం ద్వారా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు బన్నీ.

బన్నీ తో పాటు మరికొందరు తెలుగు ఇండస్ట్రీ నుంచి అవార్డులు అందుకున్నారు. పుష్ప సినిమా గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. ఇక జాతీయ ఉత్తమ నటి అవార్డును బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అందుకుంది. ఉత్తమ అభిమాన నటుడు దేశ చలనచిత్ర రంగంలో అతి ముఖ్యమైన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకోవడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు బన్నీ ఫాన్స్.