శోభ, ప్రియాంక మొఖంపై తూ మి బతుకు అంటూ ఉమ్మిన భోలే…!!

” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ 7 ఏడో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్, సందీప్ నడుమ మాటలు యుద్ధం జరిగింది. అలాగే ఇంటి సభ్యులంతా భోలేపై పడ్డారు. హౌస్ లో మెజారిటీ కంటిస్టేన్స్ ఆయనను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అమర్, శోభ, అర్జున్, ప్రియాంక, పూజ నామినేట్ చేస్తూ గట్టిగానే గొడవపడ్డారు.

ముఖ్యంగా భోలే, ప్రియాంక, శోభ మధ్య జరిగిన మాటల యుద్ధంలో భోలే నోరు జారాడు. ” తూ అంటే నీ బతుకు ఏం అవుతుంది ” అంటూ మధ్యలో కొన్ని బూతులు కూడా మాట్లాడాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియాంక కూడా తిరిగి భోలేని మాటలు అన్నది. మొత్తానికి అతనిని నామినేట్ చేసిన ప్రతి ఒక్కరూ..భోలే ఈ బిగ్ బాస్ ఆటకి సెట్ అవ్వడు.

అతనికి మాట్లాడటం రాదు.. ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు.. బయట ఎలా ఉంటున్నాడో ఇక్కడ కూడా అలాగే ఉంటున్నాడు. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో ఎలా మెలగాలో అతనికి తెలియడం లేదు అంటూ విమర్శిస్తున్నారు. ఇక తర్వాత ప్రియాంక, భోలే బూతులు మాట్లాడుతున్నాడు అంటూ బిగ్ బాస్ కి చెప్పడంతో.. బిగ్‌బాస్ దాన్ని ఖండించారు.