సినీనటి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఖుష్బూ..!!

గత కొద్ది రోజుల నుంచి సినీనటి రోజా పైన పలువురు టిడిపి నేతలు సైతం అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత బండారు సత్యనారాయణ దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను ఇలా దూషించి మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నారు.. ఓ మహిళా మంత్రి పైనా బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయని మహిళలను గౌరవించేవారు ఎవరు కూడా ఇలా మాట్లాడరంటూ పలువురు కార్యకర్తలు సినీ ప్రముఖులు కూడా ఫైర్ అవుతున్నారు.

అయితే ఈ విషయం పైన తాజాగా సినీనటి ఖుష్బూ కూడా స్పందిస్తూ తన మద్దతు రోజాకే ఉందంటూ ప్రకటించడం జరిగింది. బండారు తక్షణమే ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేదాకా పోరాటం ఆగుతూనే ఉంటుందని తెలియజేస్తోంది. మహిళల కోసం రిజర్వేషన్ల బిల్లు ప్రధాని మోడీ తెచ్చారని మహిళా సారధి కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వ్యక్తి ఇలా మహిళా నేతలపైన మాట్లాడడం చాలా దారుణంగా ఉందంటూ కుష్బూ ఆవేదనని వ్యక్తం చేస్తోంది.

దాదాపుగా చాలామంది సైతం రోజాకి సపోర్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిని బట్టి చూస్తే రోజురోజుకీ రోజా కి మద్దతు పెరిగిపోతుందని పలువురు అభిమానులు సైతం కార్యకర్తలు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి టిడిపి నాయకుడు బండారు సత్యనారాయణ మంత్రి రోజాకి సైతం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఖుష్బూ ఒక వీడియోని సైతం సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.