స్కూల్ డ్రెస్ ధ‌రించి సంద‌డి చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయంటూ..!!

శ్రీ మహాలక్ష్మి, సీమాటపాకాయి, అవును, నువ్వల నేనిలా, అవును-2, అఖండ, దసరా లాంటి సినిమాలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి పూర్ణ. ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

బుల్లితెర‌షో ఢీ తో తెలుగు ప్రజలకి మరింత దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ స్కూల్ డ్రెస్ లో కనిపించి తన ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే తన స్నేహితులను కలిసిన సందర్భంగా పూర్ణ ఇలా రెడీ అయినట్లు తెలుస్తుంది.

డిఫరెంట్ క్యూట్ స్టిల్స్ తో పూర్ణ.. తన ఫ్రెండ్ దిగిన పిక్స్ ను ” పాఠశాల రోజులు గుర్తు తెచ్చుకుంటూ ” క్యూప్షన్ రాసుకొచ్చి… సోషల్ మీడియాలో పంచుకోగా..”వావ్ చాలా క్యూట్ గా ఉన్నావ్ పూర్ణ మేడమ్.. ఇప్పటికీ స్కూల్ పిల్లలాగే ఉన్నారు ” అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.