బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్.. పెళ్లయినా తరగని అమ్మడు అందం…

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఈ ముద్దుగుమ్మ చాలామంది హృదయాలను దోచేసింది. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య, బృందావనం వంటి సినిమాల్లో అద్భుతంగా నటించే ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయింది. చూడ ముచ్చటైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలోని కాజల్ తర్వాతే ఎవరైనా.

 

అందుకే ఈ ముద్దుగుమ్మ పెళ్లయి పిల్లలు కన్నా సరే ఇప్పటికీ చాలామందికి ఒక డ్రీమ్ గర్ల్ గా ఉంది. అలాగే సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. ప్రస్తుతం భగవంత్‌ కేసరి, ఇండియన్ 2, సత్యభామ, ఉమ వంటి సినిమాల్లో నటిస్తోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియా వేదికగా హాట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఈ ముద్దుగుమ్మ అలరిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్‌ కేసరి సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ మూవీలో కాజల్ ఒక కీ రోల్ ప్లే చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ ముద్దుగుమ్మ భావిస్తోంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమా చూడాలంటూ ప్రేక్షకులను కోరుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆమె వేసుకుంటున్న డ్రస్సులు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ కలర్ శారీలో మెరిసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త వైరల్ అయ్యాయి. బ్లాక్ శారీలో సూపర్ గా ఉన్నారు అంటూ చాలామంది అభిమానులు ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.