కామెడీ ఎంటర్టైన్మెంట్గా అదరగొట్టేస్తున్న జపాన్ మూవీ టీజర్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇప్పటివరకు తను ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో పలు రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించారు. ఊపిరి సినిమాతో తెలుగులో మరింత దగ్గరైన కార్తి.. ఖైదీ ఆవారా ,యుగానికి ఒక్కడు, సర్దార్, తదితర డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజీ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కార్తీక్ ఏరియాలో 25వ సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం జపాన్.. ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

Japan (2023) - IMDb

జపాన్ సినిమాలో హీరోయిన్గా అను ఇమ్మానియేల్ నటిస్తోంది. కార్తీ 25వ సినిమా నటించడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ క్రమంలోనే నిన్నటి రోజున సాయంత్రం ఈ సినిమా టీజర్ ని సైతం చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. తాజాగా విడుదలైన టీజర్ ఈ సినిమా అంచనాలను సైతం పెంచేస్తోంది. ఈ సినిమా మొత్తం సమాచారాన్ని ఈ టీజర్ లోనే చూపించేశారు. హీరో కార్తీ లుక్ మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది ఇందులో జపాన్ అనే పేరుతో కార్తీ ఒక దొంగగా కనిపించబోతున్నారు.

దాదాపుగా ఇప్పటికే 182 కేసులు పెండింగ్ ఉన్న కార్తీ పైన మొత్తం నాలుగు రాష్ట్రాల పోలీసులను వెతుకుతూ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. బంగారం , అమ్మాయిలంటే ఇష్టమున్న ఈ దొంగ చివరికి దొరికారా లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం ఈ సినిమా ఒకేసారి నాలుగు భాషలలో పానింది వాళ్ళు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తమిళనాడులోని జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు సమాచారం