వార్ -2 నుంచి అదిరిపోయే అప్డేట్..!!

బ్రహ్మాస్త్ర సినిమాతో టాలీవుడ్ బాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ ప్రస్తుతం తాజాగా వార్-2 అనే చిత్రాన్ని స్పై యూనివర్సిటీ బ్యానర్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్టన్నింగ్ అప్డేట్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇండియన్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా తెరకెలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

వార్ -2 సినిమా స్పెయిన్ లో కొనసాగుతోందని యాక్షన్స్ సన్నివేశాలకు సంబంధించి స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.ఈ సినిమా 2025 జనవరి 24న రిలీజ్ కాబోతోందట. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ను తలదన్నే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండబోతొందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమా దేవరలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తూ ఉన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. విలన్ గాసైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

అలాగే కీలకమైన పాత్రలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లో చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా బ్యానర్ పైన తెరకెక్కిస్తూ ఉన్నారు. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.