జగన్ వ్యూహం ట్రైలర్ వైరల్..!!

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన సరే ఒక సెన్సేషనల్ గా మారుతూ ఉంటుంది. గతంలో ఎలక్షన్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి పెను సంచలనాలని సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎలక్షన్ టైం కి వ్యూహం అని ఒక పొలిటికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్ కి సంబంధించిన కథ అంశం కావడం చేత ఈ సినిమా పైన ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. అలాగే శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల వర్మ ప్రకటించారు. వైయస్ జగన్ కి సంబంధించిన ఈ కథ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పైన జరిగిన కుట్రలను సైతం జగన్ జీవితంలో ఎదుర్కొన్న సవాలను సైతం చూపించడం జరిగిందట.. ఆంధ్రప్రదేశ్ 2009-2014 వరకు రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథ అంశంతో తెరకెక్కించారు.

ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు సీఎం అయ్యాక ఏం చేశారు అనే కథంశంతో రెండు భాగాలుగా వ్యూహం సినిమాని విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో జగన్ ,భారతి జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితర పాత్రలను చూపించారు వర్మ.. ఇందులో జగన్ పాత్రకి నటుడు అజ్మాల్ నటించారు. ఇక చివరిలో చంద్రబాబు క్యారెక్టర్ తో పవన్ కళ్యాణ్ పైన జగన్ పైన చెప్పే డైలాగ్ వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం వ్యూహం ట్రైలర్ ట్రెండీగా మారుతోంది.