జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన లక్కీ నెంబర్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతారు.

RRR-starrer Jr NTR's car collection: Lamborghini Urus to Porsche 718 | The  Financial Express

తాజాగా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే గతంలో మంచు లక్ష్మి యాంకర్ గా వ్యవహరించిన ఒక షో కి గెస్ట్ గా ఎన్టీఆర్ రావడం జరిగింది. అందులో మంచు లక్ష్మి నీ కార్లు అన్నిటికీ 9 అని ఉంటుంది ఎందుకు అని అడగగా.. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ నాకు 9 అంటే చాలా లక్కీ నెంబర్ అని తెలిపారు..అంటే తన తాత రామారావు గారు కారు నెంబరు కూడా అదే నేను ఆయన అభిమానిని అందుకే 999 నెంబర్ ని పెట్టుకున్నానని తెలిపారు.

అంతేకాకుండా ఆ నెంబర్ బాగా కలిసి వచ్చిందని అదొక సెంటిమెంట్ల భావించి అదే నెంబర్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారని తెలుపుకోచ్చారు. ఎన్టీఆర్ అందుకు సంబంధించి గత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అప్పుడప్పుడు తన కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ వెకేషన్కు వెళ్తూ ఉంటారు.అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం పైన స్పందించకపోవడంతో పలువురు టిడిపి నాయకులు సైతం ఎన్టీఆర్ ను విమర్శిస్తున్నారు. అయినా వీటన్నిటిని పట్టించుకోలేదు ఎన్టీఆర్.