రేణుదేశాయ్ ని తల్లిదండ్రుల వల్ల అంతనరకం అనుభవించిందా..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది.దసరా కానుకగా అక్టోబర్ 21 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను పుట్టినప్పుడు పేరెంట్స్ నుంచి ఏ విధంగా లింగ వివక్షకు గురైందని విషయాన్ని తెలియజేయడం జరిగింది. తమ తల్లితండ్రులు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు కానీ అమ్మాయిగా నేను పుట్టాను.. చాలామంది ఎక్కువగా తన పెళ్లి విడాకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ చిన్న వయసు నుంచే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపింది. ముఖ్యంగా మదర్స్ డే వస్తే చాలు తనకు తన బాల్యమే గుర్తుకు వస్తుందని తాను పుట్టిన తరువాత మూడు రోజుల వరకు తన తండ్రి తన ముఖాన్ని చూడడానికి ఇష్టపడలేదని ఎందుకంటే అమ్మాయినని తెలిపింది.

ఈ విషయం తనకు తన తల్లి చెప్పడంతో చాలా బాధేసిందని ఆ బాధ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అని తెలుపుతోంది రేణు దేశాయ్.. ఆ వెంటనే ఒక ఏడాదిలో తనకి తమ్ముడు పుట్టాడని వాడీని మాత్రం చాలా గారభంగా రారాజుల పెంచారని తెలుపుతోంది. ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎలాంటి పరిస్థితులలో పెరిగానో అని తెలుపుతోంది.. తన విడాకుల విషయం కంటే ఆ విషయమే తనని చాలా బాధ పెట్టిందని.. ఇలాంటి తల్లిదండ్రులు రేర్ గా ఉంటారని అది నా దురదృష్టమని తెలుపుతోంది. పెరిగి పెద్దయ్యాక కూడా తనని పని వాళ్లే చూసుకున్నారని తెలిపింది.