ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు ఇంత కష్టపడతారని అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది కూడా చిరంజీవిని అడుగుతూనే ఉన్నారట.

ఇప్పుడు తాజాగా అలాంటి ప్రశ్న చిరంజీవికి ఎదురైనట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా ఇండస్ట్రీలో తాను ఒక్కడిని ఎదగడమే కాకుండా చాలా మంది కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో సహాయం చేస్తూ ఉంటారు. తాజాగా ఒక కార్యక్రమంలో చిరంజీవి పుస్తకావిష్కరణ చేస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది . సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదాలను ఎక్కువగా ఉపయోగించనని అయితే తాను ఎలాంటి పుస్తకాలు చదవలేదని.. కేవలం చాలామంది దర్శకుల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడే సందర్భాలలో విన్న మాటలే తన మనసుకు చాలా నిక్షిప్తమైపోయాయని తెలిపారు.

చాలామంది కఠినమైన పదాలు ఎందుకు మాట్లాడుతారు.. ఇంగ్లీష్ పదాలు మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటారు.. అలాంటి పదాలు వాడకుండా ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటానని తెలిపారు చిరంజీవి.. అలాగే కష్టపడడం ఆపకూడదనే విషయాన్ని కూడా తెలియజేశారు..”నేను అనుకుంటూ ఉంటా ఇంకా ఎన్నాళ్లు డాన్సులు ఫైట్లు చేయాలి రీ రికార్డింగ్ తో భమ్ అని హీరోయిన్ని లేపేస్తే హాయిగా వెళ్లి షూటింగ్ చేసి మేకప్ తుడిచేసామా నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకున్నామా ఎంత బాగుంటుంది.. అలాంటి పరిస్థితి కాదు..మనది మనం ఆడాలి.. ఒరిజినల్ గా ఫైట్లు చేయాలి ఒళ్ళు హూనం చేయాలి అప్పుడు కాని ప్రొడ్యూసర్లకు తృప్తిగా ఉండదు.. ఆడియన్స్ కి తృప్తి ఉంటుంది మాకు తృప్తి ఉంటుందంటూ ఇన్ డైరెక్ట్ గా జైలర్ సినిమా పైన సెటైర్లు వేయడం జరిగింది చిరంజీవి…