డైరెక్టర్ ని ప్రేమించి మోసం చేసిన పాయల్.. నిజమేనా..?

ఆర్ఎక్స్ 100 హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాలోనే విలన్ గా నటించడం .. మరోపక్క తన గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మను ఎవరు అంత త్వరగా మరిచిపోరనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. ఈ సినిమాలో బోల్డ్ గా నటించడంతో తదుపరి చిత్రాలలో కూడా బోల్డుగా నటించే అవకాశం లభించింది. అయితే మొదటి సినిమాతోనే అలాంటి పాత్రలో ఎంట్రీ ఇచ్చేసరికి చాలామంది ఈమెను తమ సినిమాలలో కేవలం బోల్డ్ పాత్రల్లో తీసుకోవడానికి ఇష్టపడ్డారు.

అలాంటి పాత్రలు చేసినప్పటికీ కూడా పెద్దగా ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకి , డైరెక్టర్లు హీరోయిన్లకి మధ్య ఎఫైర్ వార్తలు వినిపించడం సహజం. అయితే ఇప్పుడు పాయల్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే చాలామంది డైరెక్టర్లు , హీరోలు, హీరోయిన్లను వాడుకొని వదిలేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ పాయల్ మాత్రం ఒక డైరెక్టర్ ను వాడుకొని వదిలేసిందనే వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. అదేమిటంటే పాయల్ హీరోయిన్ కాకముందు హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందట.

అప్పుడు అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ లో నటించింది. స్టార్ ప్లస్ లో వచ్చే చాలా సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించిన ఈమె అదే సమయంలో వరుస అవకాశాలు ఇస్తున్న ఒక సీరియల్ డైరెక్టర్ ఈమె ప్రేమలో పడ్డారట. ఈమె కూడా అవకాశాల కోసం అతడితో క్లోజ్ గానే ఉంటూ వచ్చింది. ఇక ఆ డైరెక్టర్ పేరు రాకేష్ కుమార్. చాలా రోజులపాటు వీరి ప్రేమాయణం సాగినప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలని రాకేష్ కుమార్ తన ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చెప్పారట. అయితే ఈ విషయాన్ని పాయల్ కి చెప్పేసరికి ఆమె ఇప్పుడే పెళ్లి చేసుకోను.. నా గోల్ సినిమాలలో హీరోయిన్ అవడ.. కెరియర్ సక్సెస్ అవడం.. లక్ష్యం తీరకుండా అప్పుడే పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేయలేను అని చెప్పిందట. దీంతో ఒక్కసారిగా మనసు ముక్కలై ఆమెకు దూరమయ్యారు రాకేష్ కుమార్.