టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం బాగానే సక్సెస్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ కూడా తన సొంత ఆలోచనలతోనే తన అన్నంత స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లో ఎక్కువగా చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండేదట. కానీ అభిమానులు వీరిద్దరి విషయంలో ఒక నిరాశ మాత్రం ఇప్పటికే మిగిలిపోయి ఉందట. ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న వీరిద్దరూ కలిసి ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో మాత్రమే పవన్ కళ్యాణ్ చిన్న అతిధి పాత్రలో నటించారు. అయితే చిరంజీవి దర్శకుడిగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక ప్రముఖ నిర్మాత అశ్వని దత్ ఒక సినిమాని ప్లాన్ చేయడం జరిగిందట.. అయితే కథ కథనం అన్ని బాగా నచ్చాయట. కథను కూడా పరుచూరి బ్రదర్స్ అందించారట సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం.. ఫస్ట్ ఆఫ్ చిరంజీవికి నచ్చిన రెండో భాగం నచ్చకపోవడంతో మార్పులు చేయమన్నారట.. అయినప్పటికీ చిరంజీవిలో అసంతృప్తి కనిపించడంతో కొద్దిరోజులు ఈ ప్రాజెక్టు ఆపి ఆ తర్వాత ప్రారంభిద్దామని చెప్పగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలే ఎక్కలేదట.