రాజమౌళి రికార్డునే బ్రేక్ చేసిన అట్లీ..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తర్వాత టాలీవుడ్ కాకుండా అంతటి దర్శక ధీరుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ నీళ్ పేరు గుర్తుకొస్తుంది . ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి .. ప్రశాంత్ కు ఊహించని పాపులారిటీని తీసుకొచ్చింది. ఇక ఈ ఒక్క మూవీ సిరీస్ తోనే తన టాలెంట్ ను బయటపెట్టారు.

Baahubali creator SS Rajamouli's surprise phone call to Vijay 61 director  Atlee - IBTimes India

ఇకపోతే ఇప్పుడు వీరితోపాటు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తున్నారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాని ఇటీవల తెరకెక్కించిన విషయం తెలిసిందే. సుమారుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా థియేటర్లలో ఆడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నారు అట్లీ.

ఇదిలా ఉండగా తాజాగా రెమ్యునరేషన్ విషయంలో వీరిద్దరిని డైరెక్టర్ అట్లీ దాటేసారని.. సినిమా వర్గాలతో పాటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న మొదటి డైరెక్టర్గా రాజమౌళి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ అరుదైన రికార్డును డైరెక్టర్ అట్లీ తిరగరాస్తూ.. జవాన్ సినిమా సూపర్ హిట్ అవడంతో రూ.200 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం . ఒకవేళ ఇదే గనుక నిజమవుతే ఆ రికార్డును రాజమౌళి కాదు కదా కనీసం ప్రశాంత్ నీల్ కూడా ఇప్పట్లో టచ్ చేసే అవకాశం లేదు.