టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. థమన్ స్వరాలు అందించాడు. భారీ అంజనాని నడుమ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కంద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం హిట్ అవ్వలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్కందకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. అప్పుడే ఈ సినిమా ఓటీడీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా స్కంద స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. ఈ సినిమా అన్ని భాషలకు చెందిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ సాలిడ్ ధరకు దక్కించుకుంది. అయితే థ్రియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ పూర్తైపోవడంతో.. అక్టోబర్ 27వ తేదీన స్కంద సినిమాను హాట్‌స్టార్ లోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.