ఆ స్టార్ హీరో- హీరోయిన్ ప్రేమలో ఉన్నారా..?

ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణమైపోయాయి. ఇక హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం , పెళ్లి చేసుకోవడం అత్యంత సాధారణంగా మారిపోయింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు.

ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని కూడా అలాంటి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. అనుపమ పరమేశ్వరన్ , రామ్ పోతినేని ప్రేమలో ఉన్నారని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ త్వరలోనే ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. ఇకపోతే వీరిద్దరూ హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే . సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందుకే త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరొకవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ పోతినేని హీరోగా నటించబోతున్నారు. ఇక అనుపమ కూడా త్వరలోనే తన చిత్రాల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.