భగవంత్ కేసరి నుంచి ‘ ఉయ్యాలో ఉయ్యాల ‘ సాంగ్ రిలీజ్ గుండెల్ని పిండేసే సెంటిమెంట్‌( వీడియో)..!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, శ్రీ లీల – బాలయ్య కూతురుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలకు సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా నుంచి ” ఉయ్యాలో ఉయ్యాల ” అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులో బాలయ్య, శ్రీ లీల ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలయ్య చాలా యంగ్ లుక్ లో కనిపించాడు. శ్రీ లీలా కూడా చిన్న పిల్లగా స్కూల్ యూనిఫామ్ లో చక్కగా కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సాంగ్ లో కాజల్ కనిపించలేదు.

ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఫాదర్, కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అనిల్ రావిపూడి బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.