టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మామా మశ్చీంద్ర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమా వస్తుండటంతో అతడి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ నెల 6న ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా షురూ చేసింది. ఇందులో సుధీర్ బాబు మామా అల్లుళ్లుగా ట్రిబుల్ రోల్‌లో నటించడంతో అతడి యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి.
అయితే రేపు సినిమా విడుదల అవుతుండటంతో సుధీర్ బాబు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను సుధీర్ బాబు పంచుకున్నాడు. తన దగ్గరికి వచ్చిన కథల్లో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటానని, కానీ తొలిసారి డైరెక్టర్ హర్షవర్దన్ పై ఉన్న నమ్మకంతో సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిపాడు. నమ్మకంతో కథ చేసుకుని రమ్మని హర్షవర్దన్ కు చెప్పపానని, తాను అనుకుున్నట్లు డిఫరెంట్ స్క్రిఫ్ట్ తీసుకొచ్చాడని అన్నాడు. అతడి తీసుకొచ్చిన కథ బాగా నచ్చిందని, అందుకే నమ్మకంతో సినిమాలో నటించానని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు పాత్రలలో నటించాడు. ఇందులో మూడు యాసల్లో మాట్లాడనున్నాడు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ యాస ఉంటుంది. దీంతో ఈ పాత్రల కోసం సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు. ఒక పాత్ర కోసం అతడు 120 కిలోల బరువు తగ్గాలని అనుకున్నా.. ఆ తర్వాత మహేష్ బాబు, ఇతర కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గాడు. ఈ సినిమా మల్టీ లేయర్స్ కథ అని, సెంట్రల్ లేయర్ గా పరశురాం కధ ఉంటుందని తెలిపాడు.