ప్రభాస్ కల్కి సినిమా నుంచి అమితాబచ్చన్ లుక్ వైరల్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దిశాపటాని ,దీపికా పదుకొనే కూడా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగిపోయింది. ఈ రోజున అమితాబచ్చన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది.

ఈ క్రమంలోనే ప్రభాస్ కల్కి సినిమా నుంచి అమితాబచ్చన్ లుక్ రివీల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మోడరన్ టెక్నాలజీ హిందూ సనాతన ధర్మాన్ని కలుపుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం కలియుగంతంలో ఈ సినిమా స్టోరీ మొదలు కాబోతోందని ప్రభాస్ ఈ సినిమాలో మోడరన్ విష్ణుమూర్తిగా కనిపించబోతున్నారని సమాచారం.

ఈ సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్వని దత్ 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ సమయానికి పనులు ఇంకా పూర్తి అయ్యే అవకాశం కనిపించలేదు.. మరి ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)