పూజా హెగ్డేకు కార్లంటే అంత పిచ్చా.. ఆమె వ‌ద్ద మొత్తం ఎన్ని ల‌గ్జ‌రీ కార్స్ ఉన్నాయో తెలుసా?

సాధారణంగా కొందరికి కార్లంటే మ‌హా పిచ్చి. ముఖ్యంగా సినీ తారలు లగ్జరీ కార్లపై తెగ మోజు పడుతూ ఉంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చినా సరే నచ్చిందంటే వెంటనే తమ గ్యారేజ్ లోకి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఈ జాబితాలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా ఒకటి. ముంబై నుంచి టాలీవుడ్ కు దిగ‌మ‌తైన ఈ ముద్దుగుమ్మ‌.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డినా ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది.

త‌క్కువ స‌మ‌యంలో తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అయితే గ‌త ఏడాది నుంచి పూజాతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. చేసిన ప్ర‌తి సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆమెకు ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా ప‌డింది. ప్ర‌స్తుతం పూజా పాప ఒక మంచి మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. పూజా హెగ్డేకు కార్లంటే చాలా ఇష్టం.

ఆ ఇష్టంతోనే మ‌న బుట్టబొమ్మ ఒక‌టి రెండు కాకుండా ఏకంగా ఐదు ల‌గ్జ‌రీ కార్లు కొనేసింది. ఈ లిస్ట్ లో మొద‌ట చెప్పుకోవాల్సింది పోర్షే కయెన్. అత్యంత ల‌గ్జ‌రీగా ఉండే ఈ కారు విలువ రూ. 2 కోట్లు. అలాగే రూ. 60 ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే జాగ్వార్ కారు, రూ. 80 ల‌క్ష‌లు విలువ చేసే ఆడి క్యూ7 కారు పూజా హెగ్డే వ‌ద్ద ఉన్నాయి. వీటితో పాటు బిఎమ్‌డబ్ల్యూ 350డి, ఇన్నోవా క్రిస్టా వంటి కార్లు ఆమె గ్యారేజ్ లో సేద తీరుతున్నాయి. ఇక‌పోతే పూజా హెగ్డేకు అటు ముంబైతో పాటు ఇటు హైద‌రాబాద్ లోనూ సొంతంగా ఇళ్లు ఉన్నాయి.