ఎలాంటి పాత్రకైనా సరే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే లైంగిక వేధింపుల విషయం పైన పలువురు సెలబ్రిటీల సైతం స్పందించడం జరిగింది. ముఖ్యంగా మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఇలాంటి విషయం పైన చాలామంది ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది.కొంతమంది తమను కమిట్మెంట్ అడగలేదని చెప్పిన మరి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ అయినా రేష్మ ప్రసాద్ తనకు అడ్జస్ట్మెంట్ అడిగారని విషయాన్ని తెలియజేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది..

Reshma Prasad Wiki, Biography, Age, Serial, Movies, Family & More -  Cinesettai

రేష్మ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అది పెద్ద పాత్ర చిన్న పాత్ర ఏదైనా సరే మొదటిసారిగా అడ్జస్ట్మెంట్ గురించి అడిగేస్తారు కాదని అంటే ఆ సినిమాలో అవకాశాలు ఇవ్వరు.. ఇలా అడిగేందుకు వారికి ఎలాంటి మొహమాటం కూడా అడ్డు రాదని నేరుగా ముఖం మీద అడిగేస్తూ ఉంటారని తెలియజేసింది. ఎలాంటి చిన్న పాత్రకైనా సరే కమిట్మెంట్ కచ్చితంగా ఇవ్వాల్సిందే అనే అంతగా డిమాండ్ చేస్తారని రేష్మ ప్రసాద్ తెలిపింది.

కమిట్మెంట్ ఓకే అనుకుంటేనే సినిమాలో సంతకం చేయండి అని ఫోన్ చేసి మరి అడిగే వాళ్ళు కూడా ఉన్నారని ఈ తరహా వేధింపులు పరిశ్రమలో ఆగిపోనివి అంటూ కూడా తెలియజేసింది రేష్మా ప్రసాద్.. మొదటిసారిగా టీవీ సీరియల్స్ లో పాపులర్ అయిన ఈమె ఇటీవల పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. గతంలో కూడా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ప్రస్తావన విషయం పైన ఓపెన్ కావడం జరిగింది. అలాగే గాయని చిన్మయి కూడా ఇలాంటి విషయం పైన ఆరోపణలు చేసింది.