ప్రభాస్ రాజా డీలక్స్ నుంచి లీకైన వీడియో వైరల్..!!

ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ నెలలో విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికె ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపుగా రూ .450 కోట్లకు పైగా బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.

ఇక గతంలో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా లేటెస్ట్ షెడ్యూల్ నందు కొన్ని యాక్షన్ సన్నీ వేషాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.కాగా నెట్ సెట్ నుండి ఒక వీడియో లీక్ అయినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ మాళవిక మోహన్ మీద ఒక ఫైట్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. అయితే ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే ఇదేదో మార్కెట్లో ఫైట్ అన్నట్టుగా కనిపిస్తోంది.

హీరోయిన్ మాళవికాకు రోప్స్ కట్టి ఆమె గాలిలో ఎగురుతూ రౌడీలను దుమ్ము లేపుతున్నట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఫైట్ సీన్ ఉన్నాయని తాజాగా లీకైన ఈ వీడియోతో అర్థమవుతొంది.మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా డీలక్స్ అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కామెడీ హర్రర్ సినిమాగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఇలాంటి సినిమా చేస్తున్నారని విషయం తెలిసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.