ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. అభిమానులపై మరొకసారి ఎమోషనల్.. వీడియో వైరల్..!!

2023 సైమా అవార్డు వేడుకలలో RRR చిత్రానికి గాను ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SIMA -2023 అవార్డు వేడుకలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొక ఘనత అందుకున్నారు దుబాయ్ వేడుకలలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ యాక్టర్ గా RRR చిత్రానికి అవార్డును అందుకోవడం జరిగింది.

అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేజ్ పైన మాట్లాడుతూ మరొకసారి అభిమానుల పైన తనకు ఉన్న ప్రేమను సైతం తెలియజేశారు. ఈ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ కొమరం భీమ్ పాత్ర తనను మళ్ళీ మళ్ళీ నమ్మి ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ అంటూ తన కోస్టార్ మై బ్రదర్ ఫ్రెండ్ అయినా రామ్ చరణ్ కు కూడా ధన్యవాదాలు..నా అభిమానులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ తెలిపారు.

𝗠𝗮𝗻𝗼𝗳𝗠𝗮𝘀𝘀𝗲𝘀𝗡𝗧𝗥 ™ on X: "Telugu Pride @tarak9999 ❤️‍🔥💥  Header Picture Featured For @siima 2023 Telugu & Kannada ❤️‍🔥💥  #ManOfMassesNTR 🔥🔥 #NEXASIIMA #SIIMAinDubai https://t.co/WrQ1wmDhka" / X

తన ఒడిదుడుకులలో తాను కింద పడ్డప్పుడల్లా నన్ను తనని పట్టుకొని పైకి లేపేందుకు నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు అభిమానులు బాధపడినందుకు నేను నవ్వినప్పుడల్లా తనతో పాటు నవ్వినందుకు అభిమాన సోదరులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ బాగా ద్వేకంగా మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.RRR చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు ఇందులోని కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.