వాటి మీద మోజులో దురుసుగా మాట్లాడిన హీరోయిన్స్..!!

టాలీవుడ్ పరిశ్రమ ద్వారా ఎంతోమంది నటీనటులు సైతం పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇతర భాషలలో కూడా అవకాశాలు అందుకొని మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తూ ఉన్నారు.తెలుగులో అవకాశాలు వచ్చి ఇక్కడ మంచి ఫామ్ లో ఉన్నన్నాళ్లు చాలా వినయంతో ఉన్న కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ మారగానే తెలుగు సినీ ఇండస్ట్రీని దూషించడానికి కూడా వెనుకాడడం లేదు ఇప్పుడు అలాంటి హీరోయిన్ల గురించి ఒకసారి తెలుసుకుందాం.

Fashion Face-Off: Rashmika Mandanna or Rakul Preet Singh, who pulled off a  strappy kurta sharara look better? | PINKVILLA

అలా తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడిన హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా తెలుగు లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈమె బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ తెలుగు దర్శకుల పైన పలు రకాల వార్తలకు వత్తాసు పలకడం జరిగిందట. మరొక హీరోయిన్ రష్మిక బాలీవుడ్ కి వెళ్లి సౌత్ ఇండస్ట్రీ గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో ఆమె అభిమానులు కూడా ఆగ్రహానికి గురయ్యారు.

మరొక హీరోయిన్ రాశి ఖన్నా.. ఈమె ఒక ఇంటర్వ్యూలో సౌత్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తనకి కేవలం బొద్దుగా ఉన్న హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తారని బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక మరొక హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా బాలీవుడ్లోకి వెళ్లిన తర్వాత తెలుగు డైరెక్టర్ ల పైన నోరు పారేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. వీరంతా కూడా సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యి బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ సినిమాల మీద మోజుతో సౌత్ ఇండస్ట్రీని దూషించడం జరిగింది.