భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన `స్కంద‌` ఓటీటీ రైట్స్‌.. రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్‌!

ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స్కంద‌`. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. శ్రీ‌లీల‌, సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన స్కంద పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది.

రామ్ నెవ‌ర్ బిఫోర్ లుక్‌, హై ఓల్టేజ్ యాక్టింగ్‌, బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మాజ్ ఆడియెన్స్ కు స్కంద విజువ‌ల్ ఫిస్ట్ లా ఉంటుంది అన‌డంలో సందేహం లేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, థ‌మ‌న్ బీజీఎస్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. సినీ క్రిటిక్స్ కూడా స్కంద అద్భుతంగా ఉందని.. రామ్ ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇక‌పోతే స్కంద ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. స్కంద మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా రూ. 45 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓటీటీ డీల్ గా చెప్పుకోవ‌చ్చు. ఇక ఎలాగో టాక్ పాజిటివ్ గా ఉంది కాబ‌ట్టి.. థియేట‌ర్స్‌ లో రిలీజ్ అయిన ఆరు వారాల త‌ర్వాత స్కంద ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది.