సినిమాలు చేసుకుంటావా చేసుకో.. కాదని రాజకీయాల్లోకి వస్తే నరికేస్తా.. రెబల్ స్టార్ కు ప్రధాన ప్రతిపక్షనేత స్ట్రాంగ్ వార్నింగ్..!!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.” ఆదిపురుష్ ” డిజాస్టర్ అయినా ” సలార్ ” తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్లో ఉన్న ప్రభాస్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ప్రభాస్‌కి ఓ రాజకీయ నాయకుడు తల నరికేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఆ రాజకీయ నాయకుడు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు వారసత్వంగా ప్రభాస్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా తనదైన స్టైల్ లో రాణించాడు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో కృష్ణంరాజు తరపున ప్రభాస్ పోటీకి దిగబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఓ ప్రధాన ప్రతిపక్ష నేత ప్రభాస్‌కి ఫోన్ చేసి సినిమాలు చేసుకుంటున్నావు చేసుకో… రాజకీయాలు నీకెందుకు? రాజకీయాల్లోకి వస్తే తల నరికేస్తాం… అంటూ వార్నింగ్ ఇచ్చాడట.

దీంతో ప్రభాస్ కూడా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మీకు భయపడి నేను ఇలా చెప్పడం లేదు. నిజంగానే నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదంటూ చెప్పుకొచ్చాడట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై ప్రభాస్ టీమ్, ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.