పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో మాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

మిగతా భాషలతో పోల్చుకుంటే టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ చాలా తక్కువ. దర్శకుడు రాజమౌళి క్రియేటివ్ కారణంగా ” ఆర్ఆర్ఆర్” సాకారం అయ్యింది. తారక్, రామ్ చరణ్ కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చారు. పెద్ద హీరోల కాంబోలో మూవీ వస్తే చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు.

ఇకపోతే పవన్, మహేష్ లకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరుకున్న ఫాలోయింగ్ ఇక ఏ హీరోకి లేదు. అలాంటిది ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే మూవీలో నటిస్తే ఎలా ఉంటుంది. వెంట వింటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా. నిజానికి ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఇప్పటికీ రావాల్సిందే కానీ మిస్ అయ్యిందట. ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” మూవీ అందరూ చూసే ఉంటారు.

ఇందులో వెంకటేష్ పెద్దోడుగా, మహేష్ చిన్నోడు గా కనిపించారు. అయితే ఈ పెద్దోడి పాత్రకు ముందు పవన్ ను అనుకున్నారట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కానీ అప్పుడు పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో కుదరలేదట. అయితే మరో మాస్ కథ‌తో వీరిద్దరి కాంబో ట్రై చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.