బాలయ్య సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.


మరి ఈ జంట బాక్సఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటాయో లేదో వేచి చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకేక్కితున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం లో ప్రేక్షకుల ముందు వస్తుందని సమాచారం. బాబీ, బాలయ్య కాంబో లో వస్తున్న ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకేక్కుతుండడం గమనార్హం. ఈ సినిమా 100 కోట్లుకు పైగా బడ్జెట్ తో చిత్రీకరించబడుతుంది. ఇక బాలయ్య రేంజ్ సినిమా సినిమా కి పెరిగిపోతుండటంతో నందమూరి అభిమానులు సంతోషపడుతున్నారు. అయితే బాలకృష్ణ ఆయన నటించబోయే సినిమా కథ, కథనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం.

అంతేకాకుండా బాలకృష్ణ ఆయన నటించిన సినిమాలను ఎక్కువగా పండుగల సమయంలో లో రిలీజ్ చెయ్యడానికే ఇష్టపడతారట. ఇక బాలయ్య అభిమానులు కొంతమంది ఆయన మల్టీస్టరర్ మూవీ లో నటిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. మరి ఫాన్స్ కోరికమేరకు బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మల్టీస్టారర్ చేస్తాడా లేడా అనేది చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని సమాచారం. ఇక బాలయ్య సినిమాతో శ్రీనిధి శెట్టి కెరీర్ మారిపోతుందేమో చూడాలి . శ్రీనిధి జాతకం మారుతుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.