విజయ్‌వర్మను పెళ్లి చేసుకోనని చెప్పి షాకిచ్చిన తమన్నా.. వాడుకొని వదిలేయడమేనా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీ గా ఉంటుంది.

అయితే మొన్నటివరకు సినిమా లో నటనతో వార్తలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ప్రేమ విషయం లో వార్తలోకేక్కుతుంది. మిల్కీ బ్యూటీ, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకలోతు ప్రేమలో మునిగి తెలుతున్న విషయం అందరికి తెలిసిందే. లవ్ స్టోరీస్ 2 అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో విరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ లో నటించే సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో చాలారోజులు కెమెరా ల ముందే విజయ్ వర్మ, తమన్నా లు చట్టాపట్టాలెసుకొని తిరిగారు. ఇక అప్పటినుండి వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

గతంలో ఈ విషయం గురించి తమన్నా, విజయ్ స్పదించకపోయినప్పటికి ఆ తరువాత మాత్రం ఇద్దరు ప్రేమలో మునిగితేళుతున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసారు. ఇప్పుడు కూడా సమయం దొరికితే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు . దాంతో వారిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకుంటారు అని అంతా అనుకున్నారు. కానీ తమన్నా మంత్రం వారి పెళ్లి విషయం లో అందరికి షాక్ ఇచ్చింది. విజయ్ వర్మ ని ఆమె పెళ్లి చేసుకోదట. ఎప్పుడు పెళ్లి గురించి అడిగిన కూడా తమన్నా నుండి వచ్చే సమాధానం ఒకటే ‘ పెళ్లి పై నాకు నమ్మకం లేదు. నేను పెళ్లి చేసుకోను. నటించడాని ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పుకోస్తుంది. తమన్నా మాటలు విన్న చాలా మంది ‘ విజయ్ వర్మతో లవ్ అనేది కేవలం టైమ్ పాస్ కోసమేనా ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.