బాలయ్య – బోయపాటి కొత్త సినిమా అప్డేట్స్ ఇవే.. ఈసారి బొమ్మ అదిరిపోద్ది..!!

ప్రస్తుతం నందమూరి నట‌సింహ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ లీల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గతంలో నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో అఖండ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీక్వల్‌గా అఖండ 2 రాబోతుందని వార్తలు ఎప్పటినుంచో వైరల్ అవుతున్నాయి. అఖండ సినిమాకు సీక్వెల్‌ స్క్రిప్ట్ కూడా తయారైపోయిందని బాలయ్య స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య బోయపాటి చేస్తున్న కథలో సోషియా ఫాంటసీ అండ్ ఫ్యూచర్స్టిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. మెయిన్ కదా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతుంది కాకపోతే బోయపాటి మార్క్‌ యాక్షన్ సీన్స్ మాత్రం ఇందులో బాగా ఉంటాయట.

ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబి కలయికలో మరో సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్యలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాబి బాలయ్య తో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య – బోయపాటి అఖండ 2 సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే బోయపాటి చెప్పిన దాన్ని బట్టి బొమ్మ అదిరిపోద్దని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.