ఈ 5 విషయాల జోలికి అస్స‌లు వెళ్లొద్దు…!

మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోనీ సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 5 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చి పెడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. సమయం, శక్తి వృథా:
మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతుంది. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమైన విషయాలపై నే కేంద్రీకరించండీ. తద్వారా మీ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం అవుతాయి.

2. గుర్తింపుకు దూరం కావడం:
మీకు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు లేదా మీ సామర్ధ్యాలని అనవసరం లేని విషయాలపై కేటాయించడం మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా.. మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది.

3. ఇతరుల వ్యక్తిగత జీవితంలో తలదూర్చడం:
మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి తల దూర్చకుండా ఉంచడమే మంచిది. ఇతరుల వ్యక్తిగత విష‌యాల‌ను గౌరవించాలి. ఎదుట వారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు.

4. లక్ష్యానికి దూరంగా ఉండడం:
మీరు అవసరం లేని విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించడం, జోక్యం చేసుకోవడం వల్ల లక్ష్యానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లక్ష్యానికి చేరువయ్యే అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ పర్సనల్ స్టేటస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు నిజమైన ప్రయోజనాలు అందించగల ప్రయత్నాలు చేయండి.

చివరికి మిగిలేది:
అనవసర విషయాలను తరచూ ఆలోచిస్తూ.. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల నిరాశకు దారి తీస్తాయి. మీ ప్రయత్నాలు అవసరమైన విషయాలపై పెట్టి టైం వేస్ట్ చేయకుండా విలువైన అర్థవంతమైన మార్పులు కల్పించే అంశాలపై ఆసక్తి చూపించడం ఎంతైనా అవసరం.