జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై రానా రియాక్షన్ ఇదే..!!

ఇటి వలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో తమిళ సినిమా జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడంపై పలువురు అభిమానుల సైతం నిరుత్సాహంతో ఉన్నారు.. ఈ సినిమాకి కచ్చితంగా అవార్డు వస్తుందని చాలా నమ్మకాన్ని సైతం తెలియజేశారు.. నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాకి అవార్డు రాకపోవడంతో హర్ట్ అయ్యానని విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ విషయం పైన చాలామంది ప్రముఖుల సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం సైతం అవార్డుల విషయంలో తమకి అన్యాయం జరిగిందని తెలియజేశారు..

ఇలాంటి గొప్ప చిత్రాలకు కాక ఎలాంటి సినిమాలు అవార్డులు వస్తాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేయడం జరిగేది.. అయితే తాజాగా ఈ వివాదం పైన హీరో రానా హైమ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించడం జరిగింది.. సినిమాల విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు.. కొందరికి ఒక సినిమా నచ్చుతుంది మరికొందరికి నచ్చకపోవచ్చు నటుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయని తెలియజేశారు..

జై భీమ్ సినిమాకి అవార్డు వస్తుందని చాలామంది అనుకున్నారు.. కానీ అది ఎంపిక కాకపోవడం దీంతో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ కాంట్రవర్సీ చేయలేదు.. వాళ్ళు కేవలం ట్వీట్ మాత్రమే చేస్తారు కొందరు కాంట్రవర్సీ చేస్తారు.. మానటినటుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని తెలియజేశారు.. అలాగే హీరో విశాల్ కూడా నటుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇచ్చే అవార్డులను కించపరిచి మాట్లాడినట్లుగా తెలిసిందే.. ప్రేక్షకుల కన్నా గొప్ప అవార్డులు ఏది ఉండదని తనకైనా అవార్డులు వస్తే చెత్తబుట్టలో వేస్తానని తెలిపారు.