పెళ్లి ఫోటోలపై ఫైర్ అయినా సాయి పల్లవి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వారి పెళ్లి విషయం పైన ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్ వివాహం అంటే చాలు మరింత ఇంట్రెస్ట్ గా చూపిస్తూ ఉంటారు. పెళ్లి కాకపోయినా చాలా సందర్భాలలో అయినట్టుగా కూడా చూపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఇలాంటి జాబితాలో చేరిపోయింది. సాయి పల్లవికి వివాహం అయ్యిందని ఆమె మెడలో దండ వేసుకున్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.

Sai Pallavi breaks silence on wedding rumours: I have to speak up - India Today

అయితే ఇదంతా పెళ్లి ఫోటో కాదని సినిమా పూజ కార్యక్రమంలో ఒక భాగమని డైరెక్టర్ వేణువుడుగుల క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రచారం నిలువలేదు.. దీంతో ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి ఈ విషయంపై స్పందించినట్లు తెలుస్తోంది. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చిన పెద్దగా పట్టించుకోదు..కానీ ఈ పెళ్లి అనే రూమర్ క్రియేట్ చేసి ఆమె కుటుంబానికి కూడా ఈ విషయాన్ని లాగడంతో ఆమె స్పందించడం జరిగిందట.

సాయి పల్లవి ఈ విషయం పైన స్పందిస్తూ తాను ఎలాంటి విషయాలకు రియాక్ట్ కానని కానీ తన కుటుంబాన్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేశారని అందుకే స్పందించానని ఆమె క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను చేయబోతున్న కొత్త సినిమా పూజ కార్యక్రమంలో దిగిన ఫోటోని క్రాఫ్ చేసి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆమె వాపోతోంది..డబ్బు కోసమే ఇంత నీచమైన పనులు చేస్తున్నారా అంటూ ఫైర్ అవుతోంది. కొత్త సినిమా అప్డేట్ ని పంచుకోవాలనుకున్నాను.. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ పై స్పందించాల్సి వస్తోంది అంటూ సీరియస్ అయ్యింది. ఇలాంటి పని కి రాని విషయాల పై స్పందించడం తనకు చాలా బాధగా అనిపించిందని తెలుపుతోంది సాయి పల్లవి.