ఆ ఒక్క కారణంగానే రాజమౌళి, మహేష్ సినిమాను వాయిదా వేస్తున్నాడా.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా గుంటూరు కారంను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులుముందుకు రానుంది. సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ గ్లోబల్ సినిమా చేయబోతున్నాడు. రాజమౌళి కూడా తన తర్వాత సినిమా మహేష్ బాబుది ఉంటుందని ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ సంబంధించి ఎలాంటి వార్త బయటికిు రాలేదు.

కావాలనే ఈ సినిమా పూజ మరియు షూటింగ్లను వాయిదా వేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. రాజమౌళి తన ప్రతి సినిమాకు తన అన్న కీరవాణి దైవంగా కొలిచే జ్యోతిష్యూడి =తో సంప్రదింపులు జరిపి రాజమౌళి జాతకం చూపించి సినిమా ప్రారంభిస్తారు. కర్ణాటకలో ఉండే ఆ జ్యోతిష్యుడు మాటలను రాజమౌళి అసలు జవదాటడట.

 

ఎప్పటిలాగే కీరవాణి కర్ణాటక వెళ్లి జక్కన్న జాతకం చూపించారట.. ఇప్పుడు ఆయనకు మంచి సమయం లేదు.. ఈ సంవత్సరం ఎలాంటి కొత్త సినిమాలు స్టేట్స్ మీదకు తీసుకువెళ్లకూడదని అలా చేస్తే సినిమాలపై గ్రహాల చెడు ప్రభావం పడుతుందని చెప్పారట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. రాజమౌళి కూడా ఇలాంటి జాతకాలను నమ్ముతున్నాడా..? అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో కీరవాణి- రాజమౌళికే తెలియాలి.’