మంచు మనోజ్ హోస్ట్గా సరికొత్త గేమ్ షో.. అదిరిపోయే ప్రోమో..!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు అప్డేట్ ఇచ్చాడు. కెమెరా ముందుకొచ్చి నమస్కరిస్తూ ఫోటోలు షేర్ చేశాడు. క‌ళామ్మ తల్లి ముందుకి వస్తుంది అంటూ వివరించండి. దీంతో మంచు మనోజ్ మళ్ళీ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడా లేదా రియాలిటీ షోలో కనిపించబోతున్నాడు అనే సందేహం ప్రేక్షకులను నెలకొంది. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఊహించని సర్ప్రైజ్ ఎదురయింది. హోస్ట్ గా వ్యవహరిస్తూ సరికొత్త రియాలిటీ షోతో తిరిగి రాబోతున్నాడు మనోజ్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఆధ్వర్యంలో.. ఈటీవీ విన్‌ నుంచి రియాలిటీ షో ప్రారంభమవుతుంది.

దీనికి మంచి మనోజ్ హోస్ట్గా వ్యవహరించడం మరింత ఆసక్తిగా మారింది. తాజాగా రియాల్టీ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోన్ విడుదల చేశారు. మనోజ్ మళ్ళీ ఎనర్జిటిక్గా తిరిగి రాబోతున్నారని అంశాన్ని తెలియజేశారు. అలాగే ఆయన కెరీర్ కతం అని ప్రచారానికి గట్టిగా బదులుఇస్తున్నట్లుగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మనోజ్ వాయిస్ ఓవర్ తో తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకున్నట్లుగా అనిపించింది. నా ప్రపంచం మొత్తం సినిమా, నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్ గా మారింది.

నన్ను ఒక నటుడుగా, హీరోగా చూపించింది. రాకింగ్ స్టార్ అనే బిరుదున ఇచ్చింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా పండుగ వాతావరణం నెలకొన్న నా లైఫ్ లోకి సడన్గా ఓ సైలెన్స్ సినీ కెరీర్ అయిపోయింది, కెరీర్ కతం, యాక్టింగ్ ఆపేశాడు, తిరిగి రాడు అంటూ ఎన్నో విమర్శలు మౌనంగా భరించ. తిరిగి వస్తున్నాను అంటూ మనోజ్ వాయిస్ అందించాడు. అయితే ప్రోమోలో మాత్రం నాపై మూసుకుపోయిన అన్ని తలుపులకు చెబుతున్న ఆ భవనం కొనడానికి తిరిగి వస్తున్నాను అంటూ చూపించాడు. మనోజ్ గాంబిరమైన వాయిస్ మరింతగా అట్రాక్ట్ చేస్తుంది.

త్వరలోనే ఈ గేమ్‌షో సంబంధించిన డీటెయిల్స్ రానున్నాయి. ఈటీవీలో ఈ షోరిలీజ్ అయ్యే వరకు మరిన్ని వివరాల కోసం వేచి చూడక తప్పదు. ఇదే కాకుండా చాలాకాలం తర్వాత మనోజ్వాట్ దా ఫిష్ సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటుగా రవితేజ, విశ్వక్‌సేన్ మల్టీస్టారర్ గా సందీప్ రాజ్ డైరెక్షన్లో రాబోతున్న సినిమాలో విలన్ గాను మనోజ్ నటించబోతున్నట్లు టాక్. ఇలా మళ్లీ మనోజ్ తన ఫ్యాన్స్ ను అలరించేందుకు వరుస ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నాడు.