ట్రెడిషనల్ లుక్ లో.. ఇన్నోసెంట్ స్టిల్స్ తో కేజిఎఫ్ భామ కవ్వింత..

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. ప్రశాంత్ నీల్ – యష్ కాంబోలో వ‌చ్చిన‌ కేజీఎఫ్ 1, 2 సినిమాలలో టాలీవుడ్ ప్రేక్షకులకు ద‌గ్గ‌రైంది. ఇక కే జి ఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు హీరోయిన్గా నటించిన శ్రీనిధికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే వరుస అవకాశాలు క్యూ క‌డతాయి అనుకుంటే అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోషూట్లతో కుర్రకాలను ఆకట్టుకుంటుంది.

కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ధి మోడల్గా కెరీర్‌ను ప్రారంభించింది. ఇక మొదటి సినిమాతోనే పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తరువాత కేవలం విక్రమ్ తో కోబ్రా సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో ఆఫర్లు రాలేదు. ఇక సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది.

ఇటీవల సిల్వర్ కలర్ హాఫ్ సారీ లో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ఇన్నోసెంట్ ఫోజులతో బ్యూటిఫుల్ హ‌ట్ లుక్స్ తో అదరగొట్టింది. ఈ పిక్స్ నెట్టింట‌ వైరల్ అవ్వడంతో కుర్రాళ్లంతా ఆమెకు ఫిదా అవుతున్నారు. ఇక శ్రీనిధి.. బాలయ్య – బాబి కాంబోలో ఆకాశం దక్కించుకుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.