యూట్యూబ్‌లో ఏ టాలీవుడ్ హీరోకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించాడు మహేష్. మహేష్ బాబు హీరోగా,  అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీమంతుడు ‘ సినిమా 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా  అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో నాన్ బాహుబలి సక్సెసర్ గా నిలిచిన శ్రీమంతుడు అనేక ఏరియాల్లో భారీ స్థాయి కలెక్షన్ ని కొల్లగొట్టింది. ఇక ఈ మూవీలో ‘హర్ష ‘ అనే పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్, ఫ్యాన్స్ మనసు దోచేసారు మహేష్ బాబు.

అయితే విషయం ఏమిటంటే, తాజాగా శ్రీమంతుడు సినిమా యూట్యూబ్ లో మైత్రి మూవీ మేకర్స్ వారి ఛానల్ లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం గమనార్హం. తెలుగు సినిమాల్లో 200 మిలియన్ వ్యూస్ తో పాటు 834కె లైక్స్ ని కూడా సొంతం చేసుకున్న యూట్యూబ్ మొదటి సినిమా ఇదే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రికార్డు అందుకున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలిచింది.ఈ సినిమా కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.