Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!

Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు లైగర్ సినిమా అడ్రస్ లేకుండా పోతే ఖుషి సినిమాకి మాత్రం డిమాండ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.

Kushi box office: Vijay, Samantha film falls down to ₹9 cr on day 2 -  Hindustan Times

ఓవర్సీస్ లో అయితే మరీ దారుణంగా ఖుషి కలెక్షన్లు వస్తున్నాయని చెప్పాలి. కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా పెద్ద సినిమాల కంటే ఎక్కువగా రికార్డు సృష్టించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాతో సమంత మరో అరుదైన రికార్డు కూడా క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఏ హీరోయిన్ కి కూడా ఇలాంటి రికార్డు ఇప్పటివరకు దొరకలేదు. సమంత నటించిన 17 చిత్రాలు మిలియన్ క్లబ్ లో చేరడం గమనార్హం. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ , రామ్ చరణ్ వంటి హీరోలకే రెండు మూడు సినిమాలు కంటే ఎక్కువగా లేవు. కానీ ఓవర్సీస్ లో మిలియన్ క్లబ్ లో అందులోనూ 17 సినిమాలు చేరడం అంటే మామూలు విషయం కాదు.

రెండవ రోజు ఇండియా వైడ్ గా ఈ చిత్రం రూ .10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.9 కోట్లు మిగతా ప్రాంతాలలో రూ .7కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక రెండవ రోజు రూ .20 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం.