కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ భార్య భర్తను మించిపోయిందిగా.. ఎన్ని సినిమాల్లో నటించిందో మీకు తెలుసా..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. ఈ యువ దర్శకుడు కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈయన దర్శకత్వంలో సినిమాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి పైగా తెలుగులో కూడా రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాలతో అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు.

ప్రస్తుతం ఈ యువ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజ‌ర్, టైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుక్ ఖాన్ అట్లీ భార్య గురించి ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేక విషయాలు పంచుకున్నాడు.

అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈమె అసలు పేరు కృష్ణప్రియ మోహన్..మొదటలో ఈమె సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత సింగం సినిమాలో అవకాశం వచ్చింది.. మొదటి మూవీలో అనుష్క సోదరిగా నటించి ప్రియా మెప్పించింది. అలాగే ఈమె రాజా రాణి, నా పేరు శివ, తేరి సినిమాల్లో కూడా నటించారు. కోలీవుడ్ లోనే కాకుండా మలయాళ సినిమాల్లో కూడా ప్రియా నటించింది. ఇలా ఈమె తన భర్త అట్లీ కంటే తన సినిమాలతో మించిపోయిందనే చెప్పాలి.