గ్లామ‌ర్ లుక్‌తో హీటెక్కిస్తోన్న మంచు ల‌క్ష్మి…!

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవరసరాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. మొదటిలో వెండితెరపై కొన్ని సినిమాలలో కీరోల్స్ లో నటించిన మంచు లక్ష్మి తర్వాత యాంకర్‌గా తన సత్తాను చాటుకుంది. ఆమె నటనకు అంతగా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు లక్ష్మి ఫిట్నెస్ పై మాత్రం ఎంతో శ్రద్ధ చూపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కష్ట‌త‌ర‌మైన‌ వ్యాయామాలు, యోగా చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటుంది.

ఇక తాజాగా మంచు లక్ష్మి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టైట్ ఫిట్ టాప్‌లో చేతిలో డంబుల్స్ పట్టుకుని జిమ్ వేర్‌లో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోల‌ని వావ్ మ్యాగజైన్ తీసి కవర్ పేజీపై ముద్రించడంతోపాటు స్లిమ్, స్ట్రాంగ్, సెక్సీ అంటూ ట్యాగ్ ఇచ్చింది. ఆ ఫోటోను మంచి లక్ష్మి స్వయంగా తన ఇన్‌స్టా ఎకౌంట్‌లో షేర్ చేసుకుంది. దీంతో అభిమానెలు లైక్‌ల వర్షం కురిపించారు. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మంచి లక్ష్మి వాయిస్ పై మాట్లాడే విధానంపై చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

కానీ ఆమె చేసే మంచితనం గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. స్కూల్‌ల‌ను దత్తత తీసుకొని పిల్లలకు ఉన్నత విద్య, వసతులు కల్పించే ఆమె కృషి గురించి మాత్రం చాలామందికి తెలియదు. సినిమాలకు దూరంగా ఉన్నా ఎప్పుడు సోషల్ మీడియాలో మంచి లక్ష్మి ఆక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషాట్‌లు కూతురు నిర్వాణ‌తో క‌లిసి దిగిన‌ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. మంచి లక్ష్మి ఇప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీ పై పడిన తన ఫోటోలు షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.