బిగ్ బాస్ 7 టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్‌.. నేడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీళ్ళే..!

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నాగార్జున హోస్టుగా నయా సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి చివరి వరకు కంటెస్టెంట్స్ ఎంపిక కొలిక్కి రాలేదు. కొందరు చివరి నిమిషంలో తప్పుకోగా మరికొందరు కొత్తగా యాడ్ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‌ను ఎంతో గొప్పంగా ఉంచుతూ వచ్చారు. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో ఆడియన్స్ కి కేవలం లాంచింగ్ ఈవెంట్లో తెలుసుకునేలా ప్లాన్ చేశారు.

అయితే ప్రస్తుతం ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే దాదాపు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఈ సీజన్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవ‌రో ఇక్కడ చూద్దాం.. ముందుగా స్టార్ మా లో జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి ఫైనల్ అయ్యాడు. ఈయన హౌస్ లోకి వెళ్లడం కన్ఫర్మ్ అయింది.

అలాగే కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా చేసిన శోభా శెట్టి ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈమె కూడా ఈ సీజన్లో ఎంపికైంది. వీరే కాకుండా మరి కొంతమంది సీరియల్ నటులైనా ప్రియాంక జైన్, శుభశ్రీ, ఐశ్వర్య ప్రిన్సే ఈ లిస్టులో ఉన్నారట. అలాగే మోడల్ ప్రిన్స్ యువర్ ఎంపికయ్యాడట. అనూహ్యంగా నటుడు శివాజీ పేరు కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయింది. ఈయన బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్గా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాడు.

అలాగే సీమశాస్త్రి మూవీ ఫేమ్ ఫర్జానా, ఒకప్పటి శృంగార తార షకీలా హౌస్లో అడుగుపెట్టబోతున్నారట. జబర్దస్త్ నటుడు యూట్యూబర్ అయిన తేజ, వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, రైతుబిడ్డ ఫేమ్ పల్లవి ప్రశాంత్ ఎంపికయ్యారట. అలాగే ఆట సందీప్, సింగర్ దామినీ, యాంకర్ ప్రత్యూష, రితిక నాయక్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. దాదాపు లిస్ట్ ఇదే అనే ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 3 అనగా ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజ‌న్‌7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. కొన్ని గంటల్లో ఈ లిస్ట్ పై పూర్తి అవగాహన రానుంది.