ఆలియా ధ‌రించిన ఈ చీర రేటు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే…!

ప్రస్తుతం హైదరాబాద్ కుండపోత వర్షాలతో సతమతమవుతుంది హైదరాబాద్ తో సహా రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. రహదారులపై వర్షపు నీరు నిల్వండిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారు.

ఎస్సార్ నగర్, అమీర్‌పేట్‌, బోరబండ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్‌, ఎల్సీ నగర్, దిల్షుక్ న‌గ‌ర్‌, మలక్పేట సహా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోతుగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా నిన్న ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఎక్కడ భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆగిపోలేదు. అటు రోడ్లపై నిలిచిన నీళ్ళని క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసి సిబ్బంది ప్రయత్నించారు.

తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కాలనీలు చెరువులను తలపించే విధంగా మారిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులపాటు ఇలానే వర్షాలు కురుస్తాయని వివరించింది. దీంతో తెలంగాణ ఇప్పటికే అత్య‌వ‌స‌ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.