సమంత కూడా రేణు దేశాయ్ లా మారుతుందా..?

సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకటే సమాన హక్కులు ఉంటాయని పెద్దలు సమాజా సేవ చేసి సంఘాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు స్త్రీలని తప్పు పట్టడం వంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ సమంత విషయంలో కూడా ఇలాగే జరుగుతోందని ఈమె అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ లాగే సమంత కూడా మారిపోతోందని పలువురు అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.

అసలు అంతలా ఏం జరిగిందనే విషయానికి వస్తే నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే విడిపోయాక సమంత అభిమానులు ఒకలా చైతన్య అభిమానులు మరొక లాగా పలు రూమర్స్ తెలియజేశారు.. అయితే ఒకరిది తప్పు అంటే మరొకరికి తప్పు అంటూ తెలియజేశారు.. ఇదంతా పక్కన పెడితే విడాకుల తర్వాత చైతన్య సమంత ఎవరికి ఏరియాలో వాళ్ళు బిజీగా ఉన్నారు. తాజాగా సమంత నటించిన ఖుషి సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ని అందుకున్నది ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చూసిన వారంతా సమంతాను ఏకీపారేస్తున్నారు.

విజయ్ తో ఇంటిమేట్ సీన్లలో లిప్ లాక్ సన్నివేశాలు ఉండడంతో భర్త విడాకులు ఇచ్చి కూడా ఇలాంటి పని చేస్తున్నారా అంటే విమర్శిస్తున్నారు.. అక్కినేని కుటుంబం ఉండగానే నువ్వు ఇలాంటి సన్నివేశాలు చేస్తున్నావా అంటు ఆవేశపడుతున్నారు. మరి కొంతమంది సమంత బెడ్స్ సీన్స్ అప్లోడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది.. పవన్, రేణు దేశాయ్ విడాకులు ఇచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్న.. ఆమెను మాత్రం వదిన అంటూ ఫ్యాన్స్ పిలవడం జరుగుతోంది.. రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఈమెను పవన్ ఫ్యాన్స్ బెదిరించారు.. అందుకే రెండో పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసింది.. దీంతో రేణు దేశాయ్ లాగ సమంత కూడా మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.