సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన కావాలయ్యా సాంగ్… ఉబ్బితబ్బిబ్బవుతోన్న తమన్నా…

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ అనే సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఆగస్టు 10 న ఈ సినిమా ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదలై నెల కాకుండానే 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ నిర్మాణ సంస్థ చెక్కులు ఇచ్చింది. తాజాగా జైలర్ సినిమా కి సంబందించిన ఒక సంతోషకరమైన వార్తను సన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది.

జైలర్ సినిమా విజయంలో కథ, కథనం, రజనీకాంత్ నటన ఎంతటి కీలక పాత్ర పోషించాయో అనిరుధ్ సంగీతం కూడా అంతటి కీలక పాత్రను పోషించింది. ఇప్పటికీ అనిరుధ్ సంగీతం అందించిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సినిమా విడుదలై నెల కావస్తున్న నేపథ్యంలో పూర్తి వీడియో సాంగ్స్ ను సన్ పిక్చర్స్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. సరిగ్గా బుధవారం సాయంత్రం 6 గంటలకు “నువ్వు కావాలయ్య” పాటను విడుదల చేసింది. ఇప్పటికే ఈ పాట సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పూర్తి వీడియో పాటను సైతం నెటిజన్లు యూట్యూబ్లో తెగ చూస్తున్నారు. ఈ పాట విడుదల అయిన రెండు గంటల్లోనే ఒక మిలియన్ రియల్ టైం వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ విషయం తెలిసిన తమన్నా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది.

తమిళంలో ఈ పాటను అరుణ్ రాజా కామరాజ్ రాశారు. శిల్పారావు పాడారు. అనిరుధ్ ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటకు జానీ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ఈ పాటకు తగ్గట్టుగా తమన్నా అందచందాలు ఉండడంతో ఒక రేంజ్ లో దూసుకుపోయింది. వీడియో సాంగ్ కూడా అదే స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. పాటను యూట్యూబ్లో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్ మార్క్ రియల్ టైం వ్యూస్ నమోదు చేయడం పట్ల సన్ పిక్చర్స్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ నెల్సన్ దిలీప్ కుమార్,  అనిరుధ్, జానీ మాస్టర్, పాట పాడిన శిల్పారావ్, తమన్నా, సునీల్ ను ట్యాగ్ చేసారు.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో ట్రెండింగ్లో ఉంది.