ఈ హ‌ట్‌ బ్యూటీ ని బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి పంపించడానికి రీజన్ అదేనా..!!

బిగ్ బాస్ సీజన్ 7 ఆట రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అసలు ఆట మొదలు పెడుతున్నారు. మొదటి రెండు రోజులు మొహమాటం ప్రదర్శించిన ఇప్పుడు బయటపడి మాట్లాడేస్తున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. ఎదుటి వారిపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రవర్తన రెండో వారంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం రెండు రోజులకే ప్రారంభించారు.

చిన్నగా గ్రూపులు కూడా ఫామ్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ రియాల్టీ షో 7 సీజన్ ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా మొదటి వారం షకీలా, కిరణ్ రాథోడ్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కిరణ్ రాథోడ్ని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో ఈ హాట్ బ్యూటీ తెలుగులో మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడుతుంది.

కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. కిరణ్ రాథోడ్‌కి తెలుగు మాట్లాడటం రావడం లేదు. పైగా ఇంట్లో చురుగ్గా ఉండటం లేదు. డ్రెస్ సెన్స్ కూడా అస్సలు బాలేదు. ఈ కారణాలతో కిరణ్ రాథోడ్‌ని బయటకు పంపిస్తున్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజమోందో ఈరోజు రాత్రి 9 గంటలకు చూడాల్సి ఉంది.