పవన్ కళ్యాణ్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల 52వ పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు సైతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల నుండి చిత్ర బృందాలు అదిరిపోయే అప్డేట్లను సైతం ప్రకటించారు.

22YearsForTholiPrema: Here's why the Pawan Kalyan starrer works even 22  years after its release | Telugu Movie News - Times of India

ఇదంతా ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన పాట ఏంటో అని అభిమానులు తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు.. అయితే పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో తొలిప్రేమ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయి మాస్ ఆడియన్స్ సైతం సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే సినిమాలోని పాట మనసై సాంగ్ అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టమని డైరెక్టర్ కరుణాకర్ ఒకానొక సందర్భంలో తెలియజేయడం జరిగింది.

Pawan Kalyan's Tholi Prema trends on social media | Telugu Movie News -  Times of India

అయితే ఈ సినిమా పాట ఎడిటింగ్ సమయంలో కూడా పలు విషయాలను కూడా తెలియజేశారు..1998 జులై 24న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఇందులో కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలోని మనసై సాంగ్ ఎడిట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ చూపించమని అడిగారట అప్పుడు ఎడిటింగ్ జరుగుతోంది కాసేపు వెయిట్ చేయమని డైరెక్టర్ కూడా చెప్పారట. అయితే ఎడిటింగ్ పూర్తి అయ్యేసరికి రాత్రి రెండు అయ్యిందట.. అయితే ఆ తర్వాత బయటికి వచ్చి ఆ పాట చూడగానే తనకు బాగా నచ్చిందని కూడా మెచ్చుకొని చిత్ర బృందాన్ని ప్రశంసించారట పవన్ కళ్యాణ్.