కరీనా కపూర్ వ‌ర‌స్ట్ బిహేవియ‌ర్‌పై అమీషా షాకింగ్ కామెంట్స్‌..!

మాజీ బ్యూటీ అమేష పటేల్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీషా ” గాదర్2 ” తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ సాధించడంతో అమీషా పటేల్‌కు ప్రస్తుతం మరిన్ని వరుస‌ అవకాశాలు వస్తున్నాయి. ఈమె పాత్రకు ఈ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మళ్లీ అమీషాకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో అమీషా పటేల్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కరీనా కపూర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూపర్ డూపర్ హిట్ మూవీ అయిన ‘ కహూనే ప్యార్ హే ‘ సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి కరీనా కపూర్ స్వయంగా తప్పుకోలేదట. ఆమెను తప్పించార‌ని అమీషా పటేల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2000 లో హృతిక్ రోషన్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా మొదట కరీనా కపూర్‌ని అనుకున్నారని కానీ ఆమెను తప్పించి అమీషాను తీసుకోవడం పై అమీషా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అయితే కరీనాకపూర్ వరస్ట్ బిహేవియర్ వల్లే ఆమెను తీసేసి అమీషా పటేల్‌ని ఈ సినిమాలో పెట్టి ఉంటారు అని నెటిజన్లు తమ ఊహాగానాలను వ్యక్తం చేస్తున్నారు.