బాలయ్య కోసం పురందేశ్వరి YSR కాళ్లు పట్టుకుందా.. నిజాన్ని చెప్పిన పోసాని..!!

టాలీవుడ్ నటుడు పోసాని బిజెపి నేత పురందేశ్వరిపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నాయుడుని గత కొద్దిరోజుల క్రితం అరెస్టు చేయడం జరిగింది. దీంతో విచారణ కూడా చేయబడుతున్నారు అయితే ఈ విషయంపైన పురందేశ్వరి అసలు స్కిల్ స్కాం డెవలప్మెంట్లు ఏం జరగలేదని..YSRCP చెప్పినట్లుగానే ఏపీ సిఐడి నడుచుకుంటోందని పురందేశ్వరి గత కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. అయితే ఈ విషయం పైన పోసాని స్పందించడం జరిగింది.

ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లే ఆమెకు ఇలా ఏపీ ప్రభుత్వం పైన కామెంట్స్ చేసే హక్కు లేదని.. అమ్మ పురందేశ్వరి ఈరోజు మీ బావ చంద్రబాబు జైలుకు వెళితే బాధపడి పోతున్నావేమో మేం శవాలపై పేలాలు ఏరుకునే వాళ్ళమా మరి నువ్వు ఎవరు ఇప్పటికే నువ్వు మూడు పార్టీలు మారడం జరిగింది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లిపోతూ ఉంటాము నువ్వు మాపైన కామెంట్స్ చేయడం తగువేనా అంటూ తెలిపారు.. పదవి కోసం కన్నతండ్రిని చంపే మీకు మేమెంతలే మీ తమ్ముడు బాలకృష్ణ తుపాకీతో మనుషుల్ని కాల్చుకుంటూ వెళ్లినప్పుడు నీ తమ్ముడి కోసం వైయస్సార్ దగ్గర ఏడ్చుకుంటూ వెళ్లావు గుర్తుందా అంటూ తెలిపారు.

నా తమ్ముడు చెడ్డవాడే తుపాకీతో కాల్చి తప్పు చేసినవాడి అయినా సరే వాడు జైలుకు వెళ్లడానికి వీలులేదని నువ్వు వైయస్సార్ దగ్గర మొరపెట్టుకుంటే.. ఆయన నీ బాధ చూడలేక మీ తమ్ముడు పై ఒక కేసు కూడా లేకుండా చేస్తానని చెప్పిన అంతటి మహానుభావుడు బిడ్డను నువ్వు ఈరోజు ఇలా అంటున్నావే అంటూ పోసాని దిమ్మ తిరిగి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.