కృతి శెట్టి తో రొమాన్స్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..!!

సీనియర్, జూనియర్ ఏ హీరోలైన కచ్చితంగా తమ సినిమాలలో యంగ్ హీరోయిన్స్ ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన సీనియర్ హీరోల పక్కన చేసేందుకు హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని కూడా భిన్నంగా ఉన్నారు నటుడు విజయ్ సేతుపతి. ఎందుకంటే ఒక యంగ్ హీరోయిన్ తో నటించే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేశారట విజయ్ సేతుపతి.

Vijay Sethupathi reveals reason for refusing to star opposite Krithi Shetty  - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు కృతి శెట్టి ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత కొంతకాలానికి ఆయన తమిళంలో ఒక సినిమాలో హీరోగా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్ర బృందం కృతిశేట్టిని ఇందులో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. అయితే ఈ విషయం తర్వాత విజయ్ సేతుపతికి తెలియడంతో కృతి ఫోటో చూడగానే ఈ అమ్మాయికి నేను తండ్రి పాత్ర చేశాను నాకు కూతురు లాంటిది తనతో ఎలా రొమాంటిక్ చేయగలను అంటూ మొహమాటం లేకుండా నో చెప్పారట.

తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ రోజుల్లో ఒక సినిమాలో అన్నగా మరొక సినిమాలో తండ్రిగా నటిస్తూ ఉన్నారు.. ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేసే సమయంలో కృతి చాలా ఇబ్బంది పడిందట. అప్పుడే ఆమెకు ధైర్యం చెప్పారట విజయ్ సేతుపతి..నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు నువ్వు నా కూతురు లాంటి దానికి కాబట్టి నన్ను మీ తండ్రి అనుకోని నటించు అని చెప్పారట. అలా చెప్పిన తర్వాత కూడా ఆమెతో హీరోయిన్గా చేయలేనని చెప్పారట విజయసేతుపతి.